28 Nov, 2018 13:35 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: కరెంట్‌ గురించి ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. నాలుగేళ్లలో తెలంగాణను చాలా అభివృద్ధి చేశామని తెలిపారు. అన్ని ఆలోచించి ఓట్లేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లుగా నిరంతరం కరెంట్‌ ఇస్తున్నామని గుర్తుచేశారు. నిజామాబాద్‌లో జరిగిన సభలో మోదీ చిల్లర మాటల మాట్లాడారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. 

ప్రతిపక్షాలు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మవద్దని తెలంగాణ ప్రజలను కోరారు. తెలంగాణ నిధులను గత పాలకులు హైదరాబాద్‌లోని పంచుకుని తిన్నారని విమర్శించారు. తెలంగాణ సంపద పెరిగితే ప్రజలకే ఇస్తున్నామని తెలిపారు. తాము చేసే పనులు ఆలస్యమైనా ప్రజలకు కచ్చితంగా చేరుతాయని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి మేలు జరిగిందో  వారికే తెలుసని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే పెన్షన్లను రెండింతలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 
 

మరిన్ని వార్తలు