కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు ఆ సీఎం నో!

1 Apr, 2018 16:40 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బీజేపేతర కూటమి కోసం ప్రతిపక్ష పార్టీలు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే సర్కారును ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపేందుకు తాను సముఖంగా లేనట్టు ఆయన స్పష్టం చేశారు. కేరళలో సీపీఎం ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రజలకు నిజమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఇవ్వాల్సిన అవసరముందని, ఇందులో భాగంగా బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుదిశగా అడుగులు వేయాలని ఆయన సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు చాలాబలంగా ఉన్నాయని, ప్రాంతీయ పార్టీలను కలుపుకోవడం​ద్వారా ప్రజలు కోరుతున్న నిజమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఇవ్వవచ్చునని విజయన్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు