‘పాకిస్తాన్‌ కూడా మీలా ప్రశ్నించలేదు’

1 Apr, 2019 12:40 IST|Sakshi

లక్నో: భారత సైనిక బలగాల సామర్థ్యంపై ప్రతిపక్షాలు ప్రశ్నించిన విధంగా శత్రుదేశం పాకిస్తాన్‌ కూడా ప్రశ్నించలేదని ఉత్తర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సైనిక బలగాలపై దేశ ప్రజలకు పూర్తి స్థాయి నమ్మకముందని, కానీ కొంతమంది నేతలకే వారిపై నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్లను హేలనచేసే విధంగా కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి మాట్లాడే విధంగా పాకిస్తాన్‌కు చెందిన నాయకులు కూడా భారత సైన్యంపై చులకనగా మాట్లాడలేదని అన్నారు.

విపక్షాలతో వ్యాఖ్యలతో సైనికుల ఆత్మసైర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని మౌర్య విమర్శించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఐదేళ్లతో పోలిస్తే యూపీతో పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ బలంగా ఉందని స్పష్టం చేశారు. తమ పార్టీని దెబ్బతీసేందుకు బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్‌ చేతులు కలిపినా తమకు జరిగే నష్టమేమీ లేదనిఅన్నారు. బలమైన నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అది ప్రధాని మోదీతోనే సాధ‍్యమని మౌర్య అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు