రాజీనామా చేయనున్న మంత్రి కిడారి శ్రవణ్‌!

8 May, 2019 09:26 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్‌ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు కిడారి శ్రవణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబర్‌ 11న ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

అయితే కిడారి శ్రవణ్‌ కుమార్‌ ఆరు నెలల్లోగా ఏదో చట్టసభల్లో  సభ్యుడిగా ఉండాలి. ఈ నెల 10వ తేదీతో ఆరు నెలల గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్‌ నరసింహన్‌ ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కార్‌కు సమాచారం అందించింది. కాగా రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలలోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ విషయంపై కిడారి శ్రవణ్‌ కుమార్‌ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు