అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అడ్డంగా దొరికారు..

18 Feb, 2020 13:32 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి

పీఎస్‌పై ఐటీ దాడులతో బాబు బండారంబట్టబయలు

సెక్రటరీ సంపాదనే రెండు వేల కోట్లంటే బిగ్‌బాస్‌ ఇంకెంత నొక్కేశారో..  

చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ జరగాలి

సీఎం జగన్‌ సంక్షేమ పాలనపై దేశమంతా హర్షాతిరేకాలు

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచే చంద్రబాబు బండారం... అతని వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌ ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ జరిపిన దాడులతో బట్టబయలైందని వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి విమర్శించారు. రెండు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఉన్నట్లుగా ఆధారాలు లభించడంతో చంద్రబాబు ఆయనను బినామీగా పెట్టుకొని ఎలా అవినీతి జరిపారో తేటతెల్లమైందన్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలు రెండు నాలుకల ధోరణితో మా ట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో సోమవా రం విలేకరుల సమావేశంలో ఈమె మాట్లాడుతూ తన ప్రభుత్వ హయాంలో అవినీతిలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని మండిపడ్డారు. పీఎస్‌ అక్రమ సంపాదనే ఈ స్థ్ధాయిలో ఉంటే మరి చంద్రబాబు అక్రమార్జన ఏ స్థాయిలో ఉంటుందో ప్రజలకు అంతుపట్టడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి పేరుతో రూ.2.50 లక్షల కోట్లు అప్పులు చేసి శాశ్వత çప్రాతిపదికన ఒక్క పని కూడా పూర్తి చేయలేదన్నారు. చంద్రబాబు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లేందుకు సమయం ఆసన్నమైందన్నారు. శ్రీనివాస్‌కు తనకు ఎటువంటి సంబంధం లేదని చంద్రబాబు చెబుతుంటే సామాన్య ప్రజలు సైతం నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబుపై 11 కేసులుంటే న్యాయవ్యవస్ధలను మేనేజ్‌ చేసుకుని స్టేలు తెచ్చుకుని కోర్టులకు హాజరవ్వకుండా ఐదేళ్లు గడిపేశారని ఇప్పుడా పప్పులుడకవన్నారు. చంద్రబాబు నిజంగా ఎటువంటి అవినీతి చేయకుంటే సీబీఐ విచారణను బహిరంగంగా ఆహ్వానించాలని సవాలు విసిరారు. రాజధానిలోఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేసి రియల్‌ వ్యాపారం చేసుకుని వేలాది ఎకరాల భూముల్ని అనవసరంగా తీసుకున్నారన్నారు. 

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన దేశానికే ఆదర్శం
ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి కృషి చేస్తున్నారని కృపారాణి అన్నారు. దేశమంతా యువ ముఖ్యమంత్రి జగన్‌ పాలనకు జేజేలు పలుకుతూ.. ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 1.50 కోట్ల కొత్త బియ్యం కార్డులు అందించిందన్నారు. రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా సంవత్సరాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నారన్నారు. అమ్మఒడి, రైతు భరోసా వంటి పథకాలు, సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు మేలు చేస్తుంటే అభినందించాల్సిందిపోయి ఈర‡్ష్య పడటం సరికాదన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సైకిల్‌ పటాపంచలవుతుందని జోస్యం చెప్పారు. 

23న వైఎస్సార్‌సీపీ విస్తృతస్ధాయి సమావేశం
ఈనెల 23వ తేదీ సాయంత్రం 3 గంటలకు వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నట్లు కృపారాణి తెలిపారు. ఈ సమావేశంలో స్ధానిక సంస్థల ఎన్నికలపై భవిష్యత్‌ కార్యాచరణ, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. నవరత్నాల అమలుపై ప్రజల సంతృప్తస్ధాయి ఏ స్ధాయిలో ఉందో తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అంధవరపు సూరిబాబు, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయరావు, చౌదరి సతీష్, కిల్లి రామ్మోహనరావు, పి.సుగుణారెడ్డి, కొంక్యాణ మురళి, తంగుడు నాగేశ్వరరావు, పైడి రవి, పైడి చందు, వీవీఎస్‌ ప్రకాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు