సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది!

29 Dec, 2019 18:47 IST|Sakshi

పుదుచ్చేరి:  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ, సీఎం నారాయణస్వామిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కిరణ్‌ బేడీ పదవి బాధ్యతలు స్వీకరించినప్పటీ నుంచే సీఎం నారాయణస్వామిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. ప్రతిగా సీఎం నారాయణస్వామి కూడా గట్టిగానే కౌంటర్‌ ఇస్తున్నారు. కాగా.. గత కొద్దిరోజులుగా వీరిరువురి మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరుగుతోంది. పుదుచ్చేరి ఆదాయం పెంచుకునేందుకు కాసినోలు, మద్యం తయారీ సంస్థలు, లాటరీ కంపెనీలు స్థాపించాలని సీఎం నారాయణస్వామి భావిస్తుండగా, కిరణ్ బేడీ అందుకు అభ్యంతరం చెబుతుండడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నెలకొంది.

చదవండి: 'పాకిస్తాన్‌ వెళ్లమంటారా అంటూ కేంద్రమంత్రి సీరియస్‌'

ఈ క్రమంలో సీఎం నారాయణస్వామి కిరణ్‌ బేడీ గురించి ప్రస్తావిస్తూ.. ఆమె దెయ్యం, మనస్సాక్షి లేని వ్యక్తి,  జర్మనీ నియంత హిట్లర్‌కు చెల్లెలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కిరణ్‌ బేడీ కూడా కాస్త ఘాటుగా స్పందించింది. సీఎం కాస్త హుందాగా నడుచుకుంటే మంచిదని హితువు పలికారు. కొన్నిరోజులుగా మీరు నన్ను అనేక పేర్లతో దూషిస్తున్న విధానం గమనిస్తున్నాను. ఇటీవలే మీ ప్రవర్తన హద్దుమీరింది. లెఫ్టినెంట్ గవర్నర్‌గా నేనెప్పుడూ ప్రజల క్షేమం గురించే ఆలోచిస్తాను. ఈ సందర్భంగా బుద్ధుడు పేర్కొన్న హితోక్తిని కూడా కిరణ్ బేడీ ప్రస్తావించారు. 'ఎవరైనా ఒకర్ని దూషించినప్పుడు రెండో వ్యక్తి ఆ తిట్లను స్వీకరించకపోతే, ఆ తిట్లు మొదటి వ్యక్తి వద్దే ఉంటాయి' అంటూ వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా