కాంట్రాక్టర్లు మాత్రం మారలేదు: జి.కిషన్‌రెడ్డి

22 Mar, 2018 00:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రభుత్వం మారింది. పాలకులు మారారు. అధికారులు మారారు. ప్రాజెక్టులు మారాయి. ప్రాజెక్టుల ఖర్చు అంచనా లు మారాయి. అంచనాల కంటే టెండర్లు పెరిగాయి. ఇన్ని మార్పులు జరిగినా కాంట్రాక్టర్లు మాత్రం మారలేదు’అని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు.

సాగునీటి ప్రాజెక్టులపై ప్రశ్నోత్తరాల సమయంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలనే లక్ష్యానికి అనుగుణంగా రిజర్వాయర్ల నిర్మాణం జరగడంలేదు. కాంట్రాక్టర్ల లాభం కోసమే కొన్ని పనులు జరుగుతున్నాయి. నీటి ప్రవాహ రీతిని పట్టించుకోకుండా ఎక్కువ ఖర్చుతో ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. కోటి ఎకరాల సాగు ఆచరణకు తగినట్లుగా పనులు జరగడంలేదు’ అని విమర్శించారు.

మరిన్ని వార్తలు