16 ఎంపీ సీట్లు గెలిస్తే ఒరిగేదేమిటో..

10 Mar, 2019 01:23 IST|Sakshi

కేటీఆర్‌ని ప్రశ్నించిన బీజేపీ నేత కిషన్‌ రెడ్డి 

కేంద్రంపై విమర్శల్లో బాబుతో కేటీఆర్‌ పోటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ 16 ఎంపీ సీట్లు గెలిచినంత మాత్రాన ఒరిగేదేమిటో చెప్పాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ని బీజేపీ నేత జి.కిష¯Œ రెడ్డి ప్రశ్నించారు. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీలను చేర్చుకున్నాక ఎంఐఎంతో కలిసి టీఆర్‌ఎస్‌ బలం 15 ఎంపీలకు చేరుకున్నా రాష్ట్రానికి ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోదీ ప్రధాని కాకపోతే కేసీఆర్‌ పీఎం అవుతారా అని ప్రశ్నించారు. శనివారం పార్టీ నేతలు డా.ప్రకాశ్‌రెడ్డి, సుధాకర శర్మలతో కలిసి కిష¯Œ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో కేటీఆర్‌ చెబుతున్న మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలను గుర్తుకు తెస్తున్నాయని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడంలో ఏపీ సీఎం చంద్రబాబుతో కేటీఆర్‌ పోటీ పడుతున్నారని విమర్శించారు. పాకిస్తాన్‌  ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో తాను మాట్లాడాకే అభినందన్‌ను విడిచిపెట్టారని కేఏ పాల్‌ చెబుతున్నారని, అదేస్థాయిలో చంద్రబాబు ఉపన్యాసాలు హాస్యం తెప్పిస్తున్నాయన్నా రు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజ ర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేస్తారా లేదా అని ప్రశ్నిం ధచారు. రైల్వే, తదితర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వీలు లేకుండా ఈ రిజర్వేషన్ల పరిధిలోని పేదలకు రాష్ట్రప్రభుత్వం సర్టిఫికెట్లు ఇవ్వకపోవ డంతో వారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

కేంద్రంలో బీజేపీదే అధికారం.. 
కేసీఆర్‌ వద్దన్నా, కేటీఆర్‌ బాధపడ్డా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కిష¯Œ రెడ్డి అన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రానికి జరగని న్యాయం, కేంద్రంలో మోదీ వచ్చాకే 55 నెలల్లోనే వివిధ రంగాల్లో అభివృద్ధి జరిగిందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కావాలంటే అసెంబ్లీ రికార్డులను తెప్పించుకుని చూడొచ్చని కేటీఆర్‌కు సూచించారు.

మరిన్ని వార్తలు