‘ఆయుష్మాన్‌’ను అడ్డుకోవద్దు

18 Aug, 2019 02:07 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : పేదలకు ఉచితంగా వైద్య ఆరోగ్య సదుపాయాన్ని కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ఆయుష్మాన్‌ భారత్‌’కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడం తగదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. పేదలకు రూ. 5లక్షల వరకు వైద్య ఖర్చులను భరించే ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు కాకుండా మోకాలడ్డుతోందని ఆరోపించారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం కేంద్రమంత్రి పర్యటించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కంటే మెరుగైన ‘ఆయుష్మాన్‌ భారత్‌ ’ద్వారా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య సదుపాయాన్ని అందిస్తున్న ఈ పథకాన్ని అడ్డుకోవడం అంటే పేదలను వైద్యానికి దూరం చేయడమేనన్నారు.  ఏపీ, కర్ణాటక, తమిళనాడుసహా అనేక రాష్ట్రాలు ‘ఆయుష్మాన్‌ భారత్‌’ అమలు చేస్తున్నాయన్నారు. పరిసరాల పరిశుభ్రత ద్వారానే పేదలు ఆరోగ్యం గా జీవించడానికి వీలవుతుందన్నారు. ప్రతి ఒక్క రూ స్వచ్ఛ భారత్‌లో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలని  పిలుపునిచ్చారు. దేశంలో 10 కోట్ల మరుగుదొడ్లు, 18 వేల గ్రామాలకు కరెంట్‌ సదుపాయాన్ని కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానికి  దక్కుతుందని కిషన్‌రెడ్డి అన్నారు.

>
మరిన్ని వార్తలు