భైంసా బాధితులకు సాయమేదీ?

17 Feb, 2020 02:40 IST|Sakshi
ఘటన వివరాలను కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌కు వివరిస్తున్న బాధితురాలు

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ సాయం అందలేదన్న కిషన్‌రెడ్డి

భైంసా(నిర్మల్‌)/నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా భైంసా అల్లర్ల ఘటనలో నష్టపోయిన బాధితులకు రాష్ట్రం తరఫున ఇప్పటివరకు ఏ సాయం అందలేదని కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం భైంసాకు వచ్చిన ఆయన అల్లర్ల ప్రభావిత ప్రాంతమైన కోర్భగల్లిలో పర్యటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు సోయం బాపూరావు, బండి సం జయ్, ధర్మపురి అర్వింద్‌తోపాటు ఆయన బాధితులను కలిశారు. వారి తో మాట్లాడి సంఘటన, నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనం తరం భైంసాలోని విశ్రాంతి భవనం వద్ద విలేకరులతో మాట్లాడుతూ భైంసా ఘటనలో 101 మంది రూ.2 కోట్ల 33 లక్షల మేరకు నష్టపోయారన్నారు.

భైంసా బాధితుల కోసం తన మూడు నెలల వేతనం ఇస్తానని కిషన్‌రెడ్డి ప్రకటించారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పార్టీ తరఫున రూ.10 లక్షలు, ఎంపీలు సంజయ్, అర్వింద్‌ ఒక్కొక్కరు రూ.5 లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించారు. కాగా, కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతు ల్లో తెలంగాణ తల్లి బందీగా మారిందన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్‌ సమీపంలోని తల్వేద గ్రామశివారులో పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఎంఐ ఎంకు వత్తాసు పలుకుతున్న టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ద్వేషం పెరుగుతోందని, రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలకు సమాధి కడతారన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోదీ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు : సోనియా

ఇప్పుడూ నీచ రాజకీయాలా?

బలపరీక్ష నెగ్గిన చౌహాన్‌ 

కరోనా ఎఫెక్ట్‌ : రాజ్యసభ ఎన్నికలు వాయిదా

90 వేల మంది ఎన్నారైలు..పలువురికి కరోనా లక్షణాలు

సినిమా

చరణ్‌ బర్త్‌డే: ఉపాసననే స్వయంగా..

ఎస్పీ బాలు నోటా కరోనా పాట!

కరోనా లాక్‌డౌన్‌: అల్లు అర్జున్‌ ఫోటో వైరల్‌

కరోనా: సెలబ్రిటీల ప్రతిజ్ఞ

‘నా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు’

‘బాలిక వధూ’ నటుడికి పుత్రోత్సాహం