‘దేశ భద్రతకు ముప్పు తెస్తున్న టీఆర్‌ఎస్‌’

20 Nov, 2018 02:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎంతో కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీ దేశ భద్రతకు ముప్పు తెస్తోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్రమంగా హైదరాబాద్‌లో ఉంటున్న వారికి గుర్తింపు కార్డులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎంఐఎంకు సంబం« దించిన కొన్ని ఎన్‌జీవోలు అందుకు అవకాశం కల్పిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమంగా హైదరాబాద్‌లో ఉన్న వారిని వారి సొంత ప్రదేశాలకు పంపిస్తామన్నారు.

మరోవైపు మజ్లిస్, టీఆర్‌ఎస్‌ మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ మొదటి దశ ప్రచారం అయ్యాక ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదన్నారు. దీంతో కేసీఆర్‌ నిరాశ చెందారన్నారు. టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ రోజు రోజుకూ దిగజారిపోతోందన్నారు. తెలం గాణలో బీజేపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన కూటమి మహాకూటమి కాదని అదో మాయాకూటమి అని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు