ఆర్టికల్‌ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయం

1 Sep, 2019 17:16 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు ఓ చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఇంతవరకూ ఏ ప్రభుత్వం సాహసం చేయలేని పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపిస్తున్నారని ప్రశంసించారు. ఆర్టికల్‌ 370 సందర్భంగా బీజేపీ ఆధ్యర్యంలో నెల్లూరు  నగరంలో ఏర్పాటు చేసిన విజయోత్సవర ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశ సమగ్రతకు బీజేపీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని తెలిపారు. ఒకే దేశం, ఒకే ఒకే జెండా ఉండాలన్నదే మోదీ ఆకాంక్ష అన్నారు.  ఆర్టికల్‌ 370ని నెహ్రూ ప్రభుత్వం బలవంతంగా  దేశ ప్రజలపై రుద్దిందని, దాని వల్ల దేశంలో తీవ్రవాదం పెరిగిందన్నారు. కశ్మీర్‌ కోసం పాకిస్తాన్‌తో ఇప్పటి వరకు 4 యుద్ధాలు చేశామని గుర్తు చేశారు. ఆర్టికల్‌370 రద్దు చేస్తే పాకిస్తిన్‌కు ఎందుకు నొప్పి అని ప్రశ్నించారు. ఈ విషయంలో పాకిస్తాన్‌ను ఏకానిని చేసి ప్రపంచ దేశాలన్నింటిని మన వైపుకు తిప్పుకున్నామని చెప్పారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలు ఇదే బాజేపీ నినాదం అయని కిష​న్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు