బాబు చూపిన రాజధాని గ్రాఫిక్స్‌ సాధ్యం కాదు : కొడాలి నాని

29 Dec, 2019 16:09 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాజధాని అంశంపై జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదిక​అన్ని ప్రాంతాల అభివృద్దిని సూచించేలా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నట్లు మేం ఎక్కడా చెప్పలేదని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అమరావతితో పాటు మరో రెండు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తే వికేంద్రికరణలో భాగంగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

చంద్రబాబు రాజధాని పేరుతో రైతుల భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసి భారీగా డబ్బులు దండుకున్నారని విమర్శించారు. అంతేగాక రైతుల వద్ద వేలాది ఎకరాలు సేకరించి రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలకు గ్రాఫిక్స్‌ చూపించారని దుయ్యబట్టారు. ఆయన చూపించిన గ్రాఫిక్స్‌తో రాజధాని కట్టాలంటే రూ. లక్షా 15వేల కోట్లు అవసరం అవుతాయని.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్యా అది సాధ్యపడదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రైతులకు వివరిస్తామని, వారు సానకూల దృక్పథంతో అర్థం చేసుకుంటారని తాము భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

మరిన్ని వార్తలు