ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం: కొడాలి నాని

12 Dec, 2019 10:08 IST|Sakshi

సాక్షి, అమరావతి : తెల్లరేషన్‌ కార్డు ఉన్న వారికి సబ్సిడీతో కందిపప్పును ప్రజలకు పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో గురువారం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అడిగిన్న ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే కంది పప్పు ధరలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఉల్లి ధర ఎంత ఉన్నా.. రైతు బజార్లో రూ.25కే అందిస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని ధరలు పెరిగాయని, కొన్ని ధరలు తగ్గాయని.. పెరిగిన ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నమని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కొడాలి నాని చెప్పారు

మరిన్ని వార్తలు