ఏం చేశారని అధికారం ఇవ్వాలి

8 Sep, 2018 03:35 IST|Sakshi

సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ‘ఐదేళ్లు పాలించాలని ప్రజలు అధికారం అప్పగిస్తే నాలుగేళ్లకే దిగిపోయావు.. ఏం చేశారని మళ్లీ అధికారం ఇవ్వాలి.. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని గూర్ఖాలతో నెట్టించారు. తెలంగాణ వద్దని దాడులు చేయించిన వారిని పక్కన పెట్టుకున్నావు’అని తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అపధర్మ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఆ పార్టీ సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జి కుంట్ల ధర్మార్జున్‌ సూర్యాపేట నియోజకవర్గంలో చేపట్టిన మహాపాదయాత్ర శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యోగాలు కావాలని అడిగిన వారిపై దాడి చేయించారని, నీళ్లు అడిగినా ఇవ్వలేదని, ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ ఓటుకు రూ.వెయ్యి ఇచ్చి అధికారంలోకి వస్తే ఒక్కొక్కరూ రు.వెయ్యి కోట్లు దోచుకోవాలని చూస్తున్నారని, ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ప్రగతి నివేదన సభ సందర్భంగా ఎక్కడ చూసినా మందు బాటిళ్లు, తాగుతున్న వాళ్లే కన్పించారని, అలాంటి సభను తానెప్పుడూ చూడలేదన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘హెరిటేజ్‌పై ఉన్న శ్రద్ద ప్రాజెక్టులపై లేదు’

టీఆర్‌ఎస్‌ తప్పు చేసింది.. ఆ నూటైదుమంది కన్నాహీనమా నేను!

సీనియర్‌కు ఇదా గౌరవం?

‘అందుకే పాదయాత్రలో అండగా నిలుస్తున్నారు’

పద్మవ్యూహంలో టీడీపీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నా చెల్లిని తన పేరుతోనే గుర్తించండి’

కారు డ్రైవర్‌కి కూడా తెలుసు.. ఇంకా దాచాల్సిందేముంది?

విరాళంగా తొలి పారితోషికం

గాయని వాణిజయరామ్‌కు పతీవియోగం

‘సైనా’ షూటింగ్‌ షురూ!

మరో ప్రయోగం చేస్తున్న నాగ్‌..!