రైతు సమస్యలపై నిరంతరపోరు: కోదండరాం

2 Jun, 2018 02:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతు ల సమస్యలను పరిష్కరించేదాకా నిరంతరం పోరాడతామని టీజేఎస్‌ అధినేత ఎం.కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. సడక్‌ బంద్‌ విజయవంతమైన నేపథ్యంలో లెఫ్ట్‌పార్టీల నేతలతో కలిసి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. పోలీసులు అడ్డంకులు కల్పించినా పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారన్నారు.

రైతుబంధు పథకం ద్వారా పేద రైతులకంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకే మేలు జరుగుతుందని ఆరోపించారు. రైతు బంధు పథకంలో చెక్కుల పంపిణీలో, పాసు పుస్తకాల్లో అనేక తప్పులున్నాయని విమర్శించారు. చెక్కుల పంపిణీ కంటే ఎక్కువగా భూమి లో వచ్చిన తప్పులకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నేత కె.గోవర్ధన్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామిక నిరసనలకు అవకాశం లేకుండా చేయడం దారుణమన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు