రైతులను ఆదుకోవడంలో విఫలం

2 Jan, 2018 02:56 IST|Sakshi

టీపీసీసీ కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రైతులను ఆదుకోవడంలో, వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విఫలమ య్యారని టీపీసీసీ కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించకుండా వట్టి మాటలకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిమితమైందన్నారు.

మెదక్‌ జిల్లాతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయన్నారు. అలాంటప్పుడు 24 గంటల కరెంటు ఇచ్చినా రైతులకు వచ్చే ప్రయోజనం ఏంటని కోదండరెడ్డి ప్రశ్నించారు. 24 గంటల కరెంటు ఇవ్వడానికి వ్యతిరేకం కాదని, భారీ ప్రచారానికే వ్యతిరేకమన్నారు. భూగర్భజలాలు లేకుండా కరెంటు ఇవ్వడం వల్ల నష్టం తప్ప ప్రయోజనం ఏమీ లేదని రైతులు చెబుతున్నారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు