చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల శివప్రసాద్‌..!

20 Aug, 2019 13:38 IST|Sakshi

సాక్షి, గుంటూరు : అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఫర్నీచర్ మాయమవడంపై శాసనసభ మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు వివరణ ఇచ్చారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నది వాస్తవమేనని అంగీకరించారు. సత్తెనపల్లిలోని తన ఇళ్లల్లో వాటిని తెచ్చి పెట్టుకున్నట్టు ఒప్పుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ నుంచి అమరావతికి ఫర్నీచర్‌, కంప్యూటర్లు తరలించే క్రమంలో కొంత ఫర్నిచర్‌ కనిపించకుండా పోయింది.

దీనిపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది. అసెంబ్లీకి చెందిన విలువైన వస్తువులు ఎవరికీ చెప్పకుండా కోడెల తన ఇంటికి తరలించడంపై అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. అయితే, కోడెల ఆ నోటీసులకు స్పందించలేదు. పైగా తాను రాసిన లేఖలు అధికారులకు చేరకపోయి ఉండవచ్చంటూ వింత వాదన తెరపైకి తెచ్చారు. ఎవరైనా వస్తే ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేస్తానని, లేకుంటే ఆ ఫర్నిచర్‌ విలువ ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానని చెప్తున్నారు.

మరిన్ని వార్తలు