సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!

16 Sep, 2019 13:14 IST|Sakshi

ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం

ఎన్టీఆర్‌, చం‍ద్రబాబు హయాంలో మంత్రిగా సేవలు

మంచి డాక్టర్‌గా పేరుతెచ్చుకున్న కోడెల

ఎన్టీఆర్‌ పిలుపుమేరకు రాజకీయ ఆరంగేట్రం

గుంటూరు జిల్లా రాజకీయాల్లో కోడెలది సుదీర్ఘ చరిత్ర

సాక్షి, హైదరాబాద్‌: నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు కోడెల శివప్రసాదరావు జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించి.. పలుసార్లు మంత్రిగా, నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా సేవలు అందించిన ఆయన.. ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కోడెల ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయన.. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమి ఎదురైనా..  2014లో సత్తెనపల్లి నియోజకవర్గానికి మారి.. మరోసారి గెలుపొందారు. ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు మంత్రివర్గాల్లో పలు శాఖలు నిర్వహించిన ఆయన.. నవ్యాంధ్ర తొలి శాసనసభాపతిగా ఎన్నికై.. ఐదేళ్లు సేవలు అందించారు. ఆయన జీవితాన్ని ఓసారి పరిశీలిస్తే..

గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన.. విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివాడు. చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదం నుంచే డాక్టర్ కావాలని నిర్ణయించుకున్న ఆయన.. తాత ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించారు. కర్నూలు వైద్య కళాశాలలో చేరి.. రెండున్నరేళ్ళ తర్వాత తిరిగి గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వారణాసిలో ఎం.ఎస్ చదివారు. నరసరావుపేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టిన ఆయన.. అనతికాలంలోనే మంచి డాక్టర్‌గా స్థానికంగా పేరు తెచ్చుకున్నారు.

అలా పల్నాడులో అంచెలంచెలుగా ఎదిగి.. ప్రముఖ సర్జన్‌గా కీర్తిగడించిన డాక్టర్ కోడెలను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించారు. ఆయన పిలుపుమేరకు 1983లో టీడీపీలో చేరిన కోడెల మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. అసెం‍బ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లోనూ నర్సరావుపేట నుంచి ఆయన వరుస విజయాలు సాధించారు.  2004, 2009 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి పోటీచేసిన కోడెల మరోసారి విజయం సాధించారు. అనంతరం నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి.. ఐదేళ్లపాటు సేవలు అందించారు.  కోడెలకు భార్య శశికళ, ముగ్గురు పిల్లలు (విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ) ఉన్నారు.  
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి

కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి

హుజూర్‌నగర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం

కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?

మరో ఉద్యమం తప్పదు.. కమల్‌ హెచ్చరికలు

కోడెల శివప్రసాదరావు కన్నుమూత

బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు

‘కేసీఆర్‌ వాస్తవాలు మాట్లాడారు’

ఉద్ధవ్‌ అసంతృప్తి.. ఏం జరుగుతుందో!?

అమిత్‌ షా ప్రకటన అసమంజసం: మధు

హిందీయేతర ప్రజలపై యుద్ధ ప్రకటనే

అస్మదీయుల కోసమే అసత్య కథనం

వైఎస్సార్‌సీపీలోకి తోట త్రిమూర్తులు

‘సీఎం మానవీయతకు ప్రతీకలే గురుకులాలు’

జాతీయ రహదారులుగా 3,135 కి.మీ.: వేముల

ప్రకటనలు కాదు తీర్మానం చేయాలి: సీతక్క

మాట్లాడే అవకాశం  ఇవ్వట్లేదు: జగ్గారెడ్డి

చేరికలకిది ట్రైలర్‌ మాత్రమే..  

‘పోడు వ్యవసాయం చేసేవారికీ రైతు బీమా’

ప్రజాతెలంగాణ కోసం మరో ఉద్యమం 

ఐఆర్‌ లేదు.. పీఆర్సీనే!

అప్పుడు లేని మాంద్యం ఇప్పుడెలా?

99 శాతం వైరల్‌ జ్వరాలే..

తప్పు చేయబోం : కేటీఆర్‌

దేశాన్ని సాకుతున్నాం

‘దానికోసమే జనసేన పార్టీ పుట్టింది’

‘ప్రభుత్వం స్పందిచకపోతే కాంగ్రెస్‌ పోరాటం’

టీడీపీ అబద్ధాల పుస్తకం

బతికి ఉన్నన్ని రోజులూ టీఆర్‌ఎస్‌లోనే: ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాహుల్‌ కోసం పునర్నవి ఎంతపని చేసిందంటే..?

శ్రీముఖికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

‘శకుంతలా దేవీ’ మొదలైంది!

‘మాకు విజయశాంతే కావాలి అనేవారు’

లత విమర్శించినా.. రాణు మాత్రం..!

నయన్‌ ఎందుకలా చేసింది..?