విద్యుత్‌ ప్లాంట్లలో భారీ స్కాం: కోమటిరెడ్డి

12 Jan, 2018 01:10 IST|Sakshi

కేసీఆర్‌ చర్చకు రావాలని సవాల్‌

సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటులో భారీ కుంభకోణం జరిగిందని, దీనిని ఆధారాలతో సహా నిరూపిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్‌ చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్‌ కుంభకోణంపై ఎవరు చర్చకు వచ్చినా నిరూపించడానికి సిద్ధమన్నారు.

ఈ కుంభకోణంలో సీఎం కేసీఆర్‌కు భాగస్వామ్యం ఉందని, స్కాం జరగలేదనే ధైర్యముంటే కేసీఆర్‌ చర్చకు రావాలని కోమటిరెడ్డి సవాల్‌ చేశా రు. పవర్‌ లేని విద్యుత్‌ శాఖ మంత్రి జగ దీశ్‌రెడ్డితో అవసరం లేదన్నారు. కుంభకోణాన్ని నిరూపించలేకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

మరిన్ని వార్తలు