శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి

2 Aug, 2018 10:42 IST|Sakshi

తిరుమల: తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. స్వామివారి దయతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సంవృద్ధిగా కురిసి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్ధించానని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో పాలకులు తప్ప, ప్రజలు సంతోషంగా లేరు..తెలంగాణ వచ్చిన సంతోషం ఓ ఒక్కరిలోనూ లేదని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసభ్యులకు తప్ప ఇతర మంత్రులకు అధికారాలు లేవని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్‌ కూతురు కవితతో సహా టీఆర్‌ఎస్‌ పార్లమెంటు సభ్యులు మద్ధతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో అభివృద్ధి కాగితాలపై తప్ప వాస్తవంగా లేదని వ్యాఖ్యానించారు.

గురువారం కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.శ్రీవారి ని దర్శించుకున్న వారిలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి అంబటి రాంబాబు. ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, పీఠాధిపతులు సుగునేంద్ర తీర్ధ స్వామిజీ, రఘునేంద్ర తీర్ధ స్వామిజీలు ఉన్నారు.

మరిన్ని వార్తలు