అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌

19 Nov, 2018 09:01 IST|Sakshi
మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెం‍కటరెడ్డి

నల్లగొండ రూరల్‌ : కాంగ్రెస్‌ పార్టీ మిగులు తెలంగాణగా ఇస్తే కేసీఆర్‌ నాలుగేళ్లలో రెండు లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మహాకూటమి నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌కు ఆహంకారం పెరిగిందని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.  ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదన్నారు. కేసీఆర్‌ గడీల పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని చెప్పారు. తాను చెప్పిన వారికే రాహుల్‌ గాంధీ టికెట్‌లు ఇచ్చారని తెలిపారు. తాను ఇతర జిల్లాలో ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుందని, ఐక్యంగా ఉండి ఐదోసారి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

టీడీపీ నేత మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ పార్టీ వేరైనప్పటికి మంచినాయకుడని ప్రశంసించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాదగోని శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ కుటుంబం బాగుపడిందన్నారు. 50వేల మెజార్టీతో కోమటి రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ  సందర్భంగా కోమటిరెడ్డిని గజమాలతో సన్మానించారు. ఈ  సమావేశంలో జనసమితి నాయకులు పి.గోపాల్‌ రెడ్డి, పందుల సైదులు గౌడ్, సుంకరి వెంకన్నగౌడ్, పట్టణ అధ్యక్షుడు ఆకునూరి సత్యనారాయణ, రియాజ్, ఎల్‌వీ యాదవ్, మిర్యాల యాదగిరి, మధుసూదన్‌ రెడ్డి, రవి, రఫి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌ రెడ్డి, గుమ్మల మోహన్‌ రెడ్డి, సైదులు, సుభాష్‌ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు