కాంగ్రెస్‌తోనే రైతురాజ్యం

8 Oct, 2018 10:07 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సాక్షి, నల్లగొండ : రైతు రాజ్యం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆనాడే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ను సరఫరా చేశారని గుర్తుచేశారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆదివారం కోమటిరెడ్డి హైదరాబాద్‌నుంచి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అన్నెపర్తి బెటాలియన్‌ వద్దకు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుం చి జిల్లా కేంద్రం వరకు భారీగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.

ఇచ్చిన హామీలు విస్మరించి నియంతలా పరిపాలన సాగించిందని ధ్వజమెత్తారు. ము ఖ్యంగా కేసీఆర్‌ కుటుంబం దోచుకో దాచుకో అనే సిద్ధాంతానికే ప్రాధాన్యమిచ్చిందని ఆరోపించారు. కేసీఆర్‌ తన కల్లబొల్లి మాటలు వల్లెవేస్తూ మరోసారి మోసం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, ఎస్సీలకు మూడెకరాల భూమి ఏమయ్యాయని ఆ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలని కోమటిరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పా ర్టీది మాటతప్పని.. మడమతిప్పని నైజమని అన్నారు. తా ము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. అదే విధంగా నిరుద్యోగ భృతి చెల్లించడంతో పాటు పింఛన్లను పెంచుతామని చెప్పా రు. వచ్చే ఎన్నికల్లో నయవంచన పాలనకు చరమగీతం పా డి రైతురాజ్యాన్ని తీసుకురావాలని ప్రజలను అభ్యర్థించారు.

వివిధ పార్టీలనుంచి కాంగ్రెస్‌లో భారీగా చేరికలు
వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో చర్లపల్లిలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం అక్కడినుంచి పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అబ్బాసియా కాలనీలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మైనార్టీలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కార్యకర్తలు ఆయనను గజమాలతో సత్కరించారు. అదే విధంగా పెద్ద సూరారం గ్రామం నంచి దాదాపు 300 మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బైకుర్యాలీగా వచ్చి కోమటిరెడ్డి గృహంలో  కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయా కార్యక్రమాల్లో  పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మంగమ్మ, మాజీ ఎంపీటీసీ జి. కర్ణమ్మ, నాగయ్య, తర్చన,  పెండం అరుణ, రిజ్వాన్‌ అలి, మహమూద్, సమీర్, అస్కర్, ఇంతి యాజ్‌ అలీ, నిజాముద్దీన్, రజియద్దీన్, బషీర్‌ ఖాన్, పాష, షరీప్, అన్వర్,  సుంకర బోయిన వెంకన్న పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు