ఇది కేసీఆర్‌ వైఫల్యం కాదా?

5 Jul, 2020 20:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఘోరంగా విఫలమయ్యారని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం దురదష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ ప్రభుత్వాలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో పది లక్షలకు పైగా కరోనా టెస్టులు చేస్తే, అదే తెలంగాణలో మాత్రం లక్ష టెస్టులు మాత్రమే చేశారని, ఇది కేసీఆర్‌ వైఫల్యం కాదా అని సూటిగా ప్రశ్నించారు. (చదవండి : ఐసీయూలో 500 మంది బాధితులు)

 కరోనాపై పోరాటం కోసం వచ్చిన కోట్ల విరాళాలు ఎక్కడకు పోయాయని అడిగారు. మేధావులు,విద్యావంతులు,ప్రజలు కేసీఆర్‌ వైఖరిని గమనించాలని, ప్రగతి భవన్‌లో కరోనా కేసులు వచ్చాయని కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కు వెళ్లారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజల బాగోగులు చూడాలని, కరోనా పేషేంట్లకు మెరుగైన వైద్యం అందించాలని,  తక్షణమే ఈ వ్యాధి చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు