‘వైఎస్సార్‌సీపీకి 130 సీట్లు పక్కా’

22 May, 2019 13:40 IST|Sakshi

సాక్షి, తిరుపతి: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఉనికి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెబుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌ను నమ్ముతున్నారని, వైఎస్సార్‌సీపీకి పక్కాగా 130 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. లగడపాటి రాజగోపాల్‌ సర్వే చేయకుండా అబద్దాలు చెప్పారని ఆరోపించారు.  

చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
విశాఖపట్నం: ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భీమిలి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధార షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడిని చూస్తే జాలిగా ఉందన్నారు. ఆయన మరీ దిగజారిపోతున్నారని,  కాంగ్రెస్ వారి కంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి శాలువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తీరుతో తెలుగు వారి పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరగని విధంగా తమ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. మరో 24 గంటల్లో రాష్ట్రంలో రాజన్న పాలనా రాబోతుందని చెప్పారు. సొంత వదినను చంపిన దేవినేని ఉమామహేశ్వరావు, బుద్ధిలేని బుద్ధా వెంకన్నలు మీడియా ముందుకు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌