మీకు ప్ర‌ధానిని ప్ర‌శ్నించే ద‌మ్ముందా?

29 Apr, 2020 14:23 IST|Sakshi

సాక్షి, తాడేప‌ల్లిగూడెం: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు వైఖ‌రిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొట్టు స‌త్య‌నారాయ‌ణ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రం మొత్తం మీద ప‌నీపాటా లేని వ్య‌క్తి బాబు ఒక్క‌రేన‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధ‌వారం ఆయ‌న తాడేప‌ల్లిగూడెంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్‌కు బ‌య‌ప‌డి రాష్ట్రం వ‌దిలిపోయిన వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడని విమ‌ర్శించారు. క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌భుత్వం తీసుకునే చ‌ర్య‌లు ఆయ‌న‌కు క‌నిపించ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. దేశంలోనే వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌డంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అగ్ర‌గామిగా నిలిచిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఎక్కువ మందికి పరీక్షలు చేయడం వల్లే ఎక్కువ కేసులు బయటపడతాయ‌ని,  టెస్టులు చేయకపోతే కేసులు బయటకురావన్నారు. (వాస్తవాల వస్త్రాపహరణం)

ప్ర‌ధానిని ప్ర‌శ్నించే ద‌మ్ముందా?
దేశం మొత్తంలో కరోనా పాజిటివ్ కేసుల శాతం 4.1 ఉంటే ఏపీలో ఇది 1.4 శాతం కంటే తక్కువగా ఉంద‌ని తెలిపారు. ర్యాపిడ్ కిట్లు కొనుగోలులో అవినీతి జరిగింద‌ని ఆరోపిస్తున్నారు.. కానీ కేంద్రం ర్యాపిడ్ కిట్లను రూ. 790లకు కొనుగోలు చేసింద‌ని పేర్కొన్నారు. దీనిపై ముందు దేశ ప్రధాని మోదీని ప్రశ్నించి ఆ తర్వాత రాష్ట్ర పరిస్థితిని ప్రశ్నించే దమ్ముదా? అని స‌వాలు విసిరారు. ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేయకూడదనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా జగనన్న విద్యా దీవెన పథ‌కం ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరిగింద‌ని కొట్టు స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. (‘పవన్‌వి పనికిమాలిక రాజకీయాలు’)

మరిన్ని వార్తలు