కొత్త నాటకానికి తెర తీసిన చంద్రబాబు టీమ్

4 Jul, 2020 14:55 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : అమరావతి ఉద్యమానికి 200 రోజులు అంటూ చంద్రబాబు నాయుడు టీమ్ కొత్త నాటకానికి తెర తీశారని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నం కార్యానిర్వాహాక రాజధానిగా చేస్తే అభ్యంతరాలు చంద్రబాబు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. శనివారం తాడేపల్లిగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే ప్రజలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారన్నారు. గడిచిన 13 నెలల కాలంలో రైతులకు పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ప్రశంసించారు. (చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే)

ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ముంగిటకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దత్తు ధరకు ధాన్యాన్ని అమ్ముతున్నది ఒక్క వైఎస్ జగన్‌ హయాంలోనేనని కొనియాడారు. 50 వేల కుటుంబాలకు అమరావతిలో ఇళ్ళ పట్టాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ సిద్దం చేస్తుందని తెలిపారు. గడిచిన 13 నెలల కాలంలో రాష్ట్రంలో 20లక్షల అదనపు పెన్షన్లు అందించామని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అమరావతి ఉద్యమం పెయిడ్ అర్టిస్టులతో నడుస్తున్న ఉద్యమమని, అమరావతి నగర నిర్మాణం రియల్ ఎస్టేట్ కుంభకోణమని వర్ణించారు. (మోకా హత్య కేసు: విస్తుగొలిపే నిజాలు )

రాష్ట్ర ప్రజలందరూ మూడు రాజధానులు కోరుకుంటున్నారని, మూడు రాజధానుల ఏర్పాటు వలన చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. అమరావతి శంఖుస్థాపనకు 400 కోట్లు ఈవెంట్ మెనేజ్‌మెంట్‌కు ఇచ్చారని,  అమరావతి నగర నిర్మాణం రియల్ ఎస్టేట్ కుంభకోణమని వర్ణించారు. అమరావతి నగర డిజైన్లు పేరిట 700కోట్లు దుర్వినియోగం జరుగుతుందన్నారు. ఎల్లో మీడియా పూర్తిగా పత్రిక విలువులకు తిలోధకాలు ఇచ్చిందని దుయ్యబట్టారు. చంద్రబాబు తన వ్యక్తిగత స్వలాభం కోసం అమరావతి ఉద్యమం పేరిట ప్రజలు భావోద్వేగాలతో  చేలగాటం అడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగింపు దశకు చేరుకుందని అన్నారు. (కాపు రిజర్వేషన్లపై సీఎంకు ముద్రగడ లేఖ)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా