వీళ్లా సీఎం జగన్‌ను తప్పుపట్టేది?

1 Mar, 2020 12:32 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా టీడీపీ మరోసారి అబద్ధపు ప్రచారానికి దిగిందని ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కొయ్య ప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చే ముందే ప్రజలను కించపరిచేలా మాట్లాడారని పేర్కొన్నారు. దీంతో ఆందోళన తెలిపేందుకు ప్రజలు విమానాశ్రయానికి చేరుకోగా.. వారిని టీడీపీ నేతలు.. పులివెందుల, కడప నుంచి వచ్చారని, పెయిడ్‌ ఆర్టిస్టులని అనడంతో ఉద్రికత్త తలెత్తిందన్నారు. సతీసమేతంగా బంధువుల పెళ్లికి వచ్చిన బాబు ఈ రాజకీయ డ్రామా చేయడం ఏమిటని? ఇది ప్రజలను రెచ్చగొట్టడం కాదా అని ప్రశ్నించారు. విశాఖకు రాజధాని వద్దన్న ఆయనకు ప్రజల మద్దతు ఏమాత్రం లభించలేదన్నారు. కనీసం ఎయిర్‌పోర్టుకు ప్రాతినిధ్యం వహించే గణబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. బాబు దగ్గరికి రాలేదని ఎద్దేవా చేశారు. అక్కడ పట్టుమని వందమంది కార్యకర్తలు కూడా లేరని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.(లక్షల్లో ఫీజులు.. పురుగులతో భోజనం)

సబ్బం హరిని ఎన్నిసార్లు తిట్టారో అందరికీ తెలుసు
‘సబ్బం హరి టీవీలోనే తప్ప విమానాశ్రయానికి వచ్చి ఆయనకు మద్దతిచ్చారా? ఎన్నికల్లో బాబు వైఖరికి ఆగ్రహం చెంది భరత్‌, కావూరీ నీ ఇంటిమీదకు రాలేదా? నువ్వు టీవీలో శాంతి ప్రవచనాలు చెప్తున్నావు, నీ చరిత్రంతా సెటిల్మెంట్లు దౌర్జన్యాలు కాదా? చంద్రబాబు, ఆయన పార్టీ వాళ్లు ఎన్నిసార్లు సబ్బం హరిని రౌడీ, గూండా అని తిట్టారో అందరికీ తెలిసిందే. ఇక ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ కుమార్‌ కాలేజీల్లో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో పోలీసులకు అందిన ఫిర్యాదులను చూస్తే తెలుస్తుంది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కుమారుడు ఎన్ని భూదందాలు చేశారో అందరికీ తెలుసు. అందుకే చిత్తుగా ఓడించారు. ఇపుడు ఆయన భూముల సేకరణ అక్రమం అంటున్నారు. వీళ్లా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, వైసీపీని తప్పుబట్టేది? మీరు ఎంత విషం కక్కినా ప్రజాభిమానంతో సీఎం జగన్ ముందుకు వెళతారు. రాజధాని వికేంద్రీకరణ జరిగి తీరుతుంది’ అని కొయ్య ప్రసాద్‌ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు