‘ఉద్యోగులను వెంటనే పర్మినెంట్‌ చేయాలి’

5 Sep, 2018 01:37 IST|Sakshi

హైదరాబాద్‌: వివిధ ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగాలలో, కార్పొరేషన్లలో, యూనివర్సిటీలలో పనిచేస్తున్న దాదాపు 2 లక్షల 50 వేల మంది కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్, దినసరి వేతన ఉద్యోగులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని తెలంగాణ కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమావేశం డిమాండ్‌ చేసింది. మంగళవారం బీసీ భవన్‌లో గుజ్జ కృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్‌.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో తాత్కాలిక ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేస్తామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. అధికారం చేపట్టి 4 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ ఒక్క ఉద్యోగాన్ని కూడా రెగ్యులరైజ్‌ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులు అడ్డుతగులుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనడం సరికాదని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రైతుల చేతులకు సంకెళ్లు వేసిన ఘనత టీఆర్‌ఎస్‌దే’

ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్‌కు ఆజాద్‌ సూటి ప్రశ్న

‘రాష్ట్ర విభజనకు అనుకూలమని చెప్పింది ఈయనే’

కాగ్‌ నివేదికలో పోలవరం అవినీతి బట్టబయలు

ఆజాద్‌ను చుట్టుముట్టిన ఆశావాహులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆర్‌ఎక్స్ 100’ కార్తికేయ హీరోగా ‘హిప్పీ’

బుల్లితెరకు విశాల్‌!

చరణ్‌కు చిరు సర్‌ప్రైజ్‌

‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ లోగో లాంచ్

‘నవాబ్‌’ కూడా నిజజీవిత పాత్రల నేపథ్యమే..!

చిన్నారి కలను నిజం చేసిన సూర్య