ఇంకో 15 ఏళ్ళు అధికారంలో ఉంటాం : కేటీఆర్‌

29 Jun, 2018 19:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని  మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా మడిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వాసవి క్లబ్‌ను ఏర్పాటు చేసింది కేసీ గుప్తా అని కేసీ అంటే కల్వకుంట్ల చంద్రశేర్‌ గుప్తా అని గుప్తాకు మాకు ఎక్కడో దగ్గరి సంబంధం ఉందని అన్నారు. యాద్రాద్రి, హైదరాబాద్ లో చారిటబుల్ హాస్పిటల్ స్థలం కోసం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తో కలిసి సీఎంను ఒప్పిస్తామన్నారు. కేసీఆర్‌ అది చేయలేదు ఇది చేయలేదు అని అడుగుతున్న కాంగ్రెస్‌ నేతలు 60 ఏళ్ళు అధికారంలో ఉన్నపుడు అభివృద్ది చేసి వుంటే  ఇంకా మన దేశంలో వేల గ్రామాలకు ఇప్పటికి కరెంట్  దిక్కు లేదని ప్రశ్నించారు.

ఒకప్పుడు ఆంధ్ర, తెలంగాణలకు బలవంతపు పెళ్లి చేసింది కాంగ్రెస్ పార్టీయే అని ఎద్ధేవ చేశారు. ​​తెలంగాణ అమ్మ ఇచ్చింది అని కాంగ్రెస్ వాళ్ళు చెబితే ఎవరు ఇవ్వలేదు.. మేమే గుంజుకున్నం అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అందుకే పోయిన ఎన్నికల్లో ప్రజలు వాళ్ళను ఓడించారు. జనాలను చైతన్యం చేస్తారట బిజేపి వాళ్ళు. ఇప్పటికే ప్రజలు చైతన్యంగ ఉన్నారని, ఈ సారి కూడా వారి వీపులు పగలగొడతారిని కేటీఆర్‌ ఆరోపించారు.  తెలంగాణ కోటి ఏకరాల మాగాణి అని కేసీఆర్ చెప్పారు.

రాష్ట్రంలో ఇంటింటికీ నీలిచ్చిడు పక్కా.. కాంగ్రెస్ వాళ్ళ కిందకు నీళ్ళు తెచ్చుడు కూడా పక్కా అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇంకో 15 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని కేటీఆర్‌ ధీమ వ్యక్తం చేశారు. ఎన్నికల కాలం వచ్చిందంటే  ఎక్కువగా గాలి మాటలు వినిపిస్తాయి. కొద్ది రోజులు ఉంటే నోటికి ఏది వేస్తే అది మాట్లాడే నాయకులు కూడా మీ దగ్గరి వస్తారు. అవసరం అయితే ఇంటికి తులం బంగారం కూడా ఇస్తారని చెప్పుతారు, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాని ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చిందని కేటీఆర్‌ అన్నారు.

>
మరిన్ని వార్తలు