ఫలితాలపై స్పందించిన కేటీఆర్‌

23 May, 2019 20:01 IST|Sakshi

ప్రజా తీర్పును గౌరవిస్తాం

గెలిచిన అభ్యర్థులను శుభాకాంక్షలు

గెలుపోటములు సహజం : కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు తమ పార్టీ అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమేనని, ప్రజా తీర్పును గౌరవిస్తానని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 16 సీట్లు గెలవాలని తాము ఆశించామని.. కానీ మా అంచనాలకు విరుద్ధంగా ప్రజలు తీర్పునిచ్చారని కేటీఆర్‌ నిరాశ వ్యక్తం చేశారు. కాగా 16 సీట్లే లక్ష్యంగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌కు ఊహించని ఫలితాలు ఎదురైయ్యాయి. ముఖ్యంగా నిజామాబాద్ లోక్‌సభ  స్థానంలో కేసీఆర్‌ కుమార్తె కవిత ఓటమి చెందడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొత్తం 17 స్థానాల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 4, ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందగా మిగతా స్థానాలను కారు పార్టీ సొంతం చేసుకోనుంది. 
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌