మల్కాజ్‌గిరిలో రేవంత్‌ది గెలుపే కాదు : కేటీఆర్

28 May, 2019 14:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ లోక్‌సభ ఫలితాలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పందించారు. శాసనసభ్యుల కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్‌కుమార్ నామినేషన్‌ వేయడానికి ఎల్పీ ఆఫీసుకు వచ్చిన సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. కేటీఆర్‌ మాట్లాడుతూ..  '‌లోక్‌ సభ ఎన్నికల్లో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. లోక్‌సభ ఎన్నికల్లో మాకు సీట్లు పోయినా ఓటు శాతం పెరిగింది. గతం కంటే 6 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కు పెరిగాయి. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌పార్టీ వెంట్రుక వాసిలో గెలుపొందింది. రేవంత్‌ రెడ్డిది ఒక గెలుపు కానే కాదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మాకు తాత్కాలిక స్పీడ్‌ బ్రేకర్‌లాంటివే. దేశ వ్యాప్తంగా మోదీ హవా ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ మంచి సీట్లను గెలుచుకుంది. ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం బీజేపీ గెలుస్తుందని ఊహించలేదు. విచిత్రమైన ట్రెండ్‌ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కనిపించింది. అలాగే వరుస ఎన్నికలు, పాలనలో జాప్యం ప్రభావం ఉందేమో విశ్లేషిస్తాము.

సిరిసిల్లలో బీజేపీకి కార్యకర్తలు కూడా లేరు. అసెంబ్లీ ఎన్నికలకంటే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ ఫలితాలతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చెందొద్దు. వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి వచ్చిన మెజారిటీ మిగతా చోట్ల బీజేపీ, కాంగ్రెస్‌ గెలిచిన అభ్యర్థులకంటే ఎక్కువ వచ్చింది. నేను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎక్కడా ఫెయిల్‌ అ‍వ్వలేదు' అని కేటీఆర్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా