‘ఉన్నావ్‌’ నిందితుడికి సెక్యురిటీ కట్‌

20 Apr, 2018 19:13 IST|Sakshi
కుల్దీప్‌సింగ్‌ సెంగర్‌

లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం  సృష్టించిన ఉన్నావ్‌ లైంగిక దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగర్‌కు సంబందించి యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు​కుంది. పదిహేనేళ్ల బాలికను అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడుగా ఉన్న  కుల్దీప్‌సింగ్‌కు కేటాయించిన  ‘వై’ కేటగిరి భద్రతను తొలగిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. ఎమ్మెల్యేకు భద్రత కల్పిస్తున్న 11 మంది కమాండోలను ఉపసంహరించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశించారు.

కేసులో ప్రధాన  నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యేను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కుల్దీప్‌ పై కిడ్నాపింగ్‌, చిన్నారులపై లైంగిక వేధింపుల చట్టం (పోస్కో), ఐపీసీ 164 సెక్షన్‌ కింద మూడు కేసులను సీబీఐ నమోదు చేసింది. నిందితుడిపై  అత్యాచార ఆరోపణలు వచ్చానా, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆలాహాబాద్‌ హైకోర్టు ఆదేశం మేరకు యూపీ పోలీసులు కుల్దీప్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసు సీబీఐ విచారణలో ఉంది.

మరిన్ని వార్తలు