కుమార కాషాయ రాగం

30 Oct, 2019 08:07 IST|Sakshi

బీజేపీ సర్కారుకు మద్దతుగా మాట  

కాంగ్రెస్‌కు సంకటం, బీజేపీకి సంతోషం

సాక్షి, బెంగళూరు: జేడీఎస్‌ అగ్రనేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి బీజేపీకి అనుకూలంగా కొత్త పల్లవి అందుకున్నారు. మొన్నటివరకు కాంగ్రెస్‌తో  చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఆయన కాషాయ పార్టీకి అనుకూలంగా గళం సవరించుకున్నారు. రాష్ట్రంలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ కూలిపోయే అవకాశమే లేదని, ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే బీజేపీకి తమ పార్టీ మద్దతునిస్తుందని కుమారస్వామి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.  

అందుకోసమేనా.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీనియర్లు డీకే శివకుమార్, పరమేశ్వర్‌ వంటివారిపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతుండడం, తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం కుమారస్వామి  ఈ ఎత్తుగడను వేస్తున్నట్లు చర్చ సాగుతోంది. జేడీఎస్‌లోని పది నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ, అధికార పార్టీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలు చేస్తున్నారు. ఈ తరుణంలో తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పావులు కదిపారు. బీజేపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటిస్తే తమ ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా ఆగిపోతారనే ఉద్ధేశంతోనే ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కుమారస్వామి ప్రకటన సీఎం యడియూరప్పకు ఊరట కలిగించి ఉంటుంది. మెజారిటీ లేని ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న యడ్డి డిసెంబరులో జరిగే ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి తీరాల్సిందే. ఇలాంటి సమయంలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కుమారస్వామి బహిరంగంగా ప్రకటించడం యడియూరప్పకు ప్రయోజనం కలిగించే అంశమే. బీజేపీని ఎలాగైనా గద్దె దింపాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ నేతలను కుమార యూ– టర్న్‌ నీరుగార్చింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీడీపీది ముగిసిన చరిత్ర

అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది

కలెక్టరేట్ల ముట్టడి.. ఆందోళనలు

ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారు

ఎవరి పంతం వారిది! 

శివసేనకు కాంగ్రెస్‌ మద్దతు!

‘ఆయన తిన్నది అరక్క దీక్ష చేస్తున్నారు’

‘ఆ విషయంలో కేసీఆర్‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డు’

‘వల్లభనేని వంశీకి బీజేపీ ఆహ్వానం’

దీపావళి నాడే ఆ దేశ వస్తువులు వాడొద్దంటారు కానీ..

‘వైఎస్‌ జగన్‌ మాటిస్తే.. గుర్తు చేయాల్సిన పనిలేదు’

పవన్‌ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి: అవంతి

‘పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతా’

డౌటే లేదు.. నేనే సీఎం: ఫడ్నవిస్‌

శివసేన ఎంపీ సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుకు ఎమ్మెల్యే వంశీ వాట్సప్‌ లేఖ

‘సీఎం అబద్ధాలు చెప్పారు’

హరియాణా సీఎంగా ఖట్టర్‌ ప్రమాణం

బీజేపీ, శివసేన మధ్య ‘50:50’పై పీటముడి

‘టీడీపీ అధ్యక్షుడిగా బాబు ఉంటారో ఉండరో’

‘గంటాను చంద్రబాబు అప్పుడే బెదిరించారట’

స్వరం మార్చిన శివసేన!

‘రాత్రి వరకు ఆరోగ్యం బాగానే ఉంది.. కావాలనే’

ఆయనకు మ్యాన్షన్‌ హౌస్‌ గురించి బాగా తెలుసు!

బీజేపీకి చుక్కలు చూపిస్తున్న శివసేన

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా

థాక్రే చేతిలోనే రిమోట్‌ కంట్రోల్‌.. సీఎం పదవిని పంచాల్సిందే!

సీఎంగా ఖట్టర్‌.. డిప్యూటీ సీఎం దుష్యంత్‌..

పండగ వేళ విషాదం.. బీజేపీ సీనియర్‌ నేత మృతి

చిన్నమ్మను బయటకు తీసుకొస్తాం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాత్రలా మారిపోవాలని

ఇది మనందరి అదృష్టం 

ఫారిన్‌ ప్రయాణం

కొత్త తరహా కథ

ప్రేమ..వినోదం...

రణస్థలం హిట్‌ అవ్వాలి – పూరి జగన్నాథ్‌