రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

8 Jul, 2019 09:04 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : రాష్ట్రంతో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఉదయం రెబల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ రహస్య ప్రాంతంలో వీరు సమావేశం కావడం విశేషం. కాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీమంత్రి, బీటీఎం లేఔట్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డిని, ఆయన కుమార్తె సౌమ్యారెడ్డిని శనివారం రాత్రి కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ కేసీ వేణుగోపాల్‌ కలిసి రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే రామలింగారెడ్డి తనకు జరిగిన అన్యాయంతో పాటు పార్టాలో నెలకొన్న సమస్యలనూ చెబుతూ రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పడంతో వేణుగోపాల్‌ నిరాశతో వెనుదిరిగారు. ఈ సమావేశంలో రామలింగారెడ్డి డీసీఎం పరమేశ్వర్‌పైన ఆరోపణలు గుప్పించినట్లు తెలిసింది. 

మరోవైపు పార్టీలో జరుగుతున్న అనూహ్య మార్పులు తనను ఆవేదనకు గురి చేశాయని, దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, పార్టీకి కాదని, 46ఏళ్లుగా పార్టీ కోసం సేవ చేస్తూనే ఉన్నానని రామలింగారెడ్డి అన్నారు. పార్టీ కూడా తనకు అనేక పదవులు ఇచ్చిందని, అయితే పార్టీలో జరుగుతున్న పరిస్థితులపై రాష్ట్ర ఇన్‌చార్జ్‌ కేసీ వేణుగోపాల్‌, సీఎం కుమారస్వామికి వివరించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఏమి జరుగుతుంతో చెప్పలేనని రామలింగారెడ్డి పేర్కొన్నారు.

చదవండిబుజ్జగింపుల పర్వం షురూ

మరిన్ని వార్తలు