హరియాణా కాంగ్రెస్‌కు కొత్త సారథి..

4 Sep, 2019 18:07 IST|Sakshi

న్యూఢిల్లీ : హరియాణా కాంగ్రెస్‌ నూతన సారథిగా కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా నియమితులయ్యారు. ఈ ఏడాది చివర్లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని ముఖ్య నాయకుల మధ్య  విభేదాలు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సెల్జా నియామకం వైపు మొగ్గు చూపింది. 

దళిత సామాజిక వర్గానికి చెందిన సెల్జా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి  సెల్జా సన్నిహితురాలుగా ఉన్నారు. రాష్ట్రంలో 19 శాతం ఉన్న దళిత ఓటర్లను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెల్జా తండ్రి చౌదరి దల్వీర్‌సింగ్‌ కూడా హరియాణా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. తనను కాంగ్రెస్‌ చీఫ్‌గా నియమించడంపై స్పందించిన సెల్జా.. ఇది తనపై బాధ్యతను మరింతంగా పెంచిందని తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాననని స్పష్టం చేశారు. 

రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ ఉన్న అశోక్‌ తన్వార్‌, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌కు మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.  అశోక్‌ తన్వార్‌ను పీసీసీ అధ్యక్ష బాధ్యతల తొలగించాలని భూపిందర్‌ సింగ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు భూపిందర్‌సింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగించవద్దని అశోక్‌ కోరుతున్నారు. అయితే ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్‌ అధిష్టానం సెల్జాకు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. భూపిందర్‌సింగ్‌ను పార్టీ ఎలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా నియమించింది. కాగా, 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి.. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చంద్రబాబు డీఎన్‌ఏలోనే నాయకత్వ లోపం ఉంది’

‘నాకు పార్టీలో అన్యాయం జరిగింది’

కమల్‌నాథ్‌పై వ్యంగ్యాస్త్రాలు

‘పల్నాడు అరాచకాలపై చర్చకు సిద్ధం’

చంద్రబాబుకు చెప్పే పార్టీ మారాను : రేవూరి

చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం

ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించినవారిని అరెస్ట్ చేయాలి

బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్‌

పోలీసులపై అయ్యన్న పాత్రుడి చిందులు

8న తమిళసై, 11న దత్తాత్రేయ ప్రమాణం

పవన్‌ ఎందుకు ట్వీట్లు చేయడం లేదో: గడికోట

గంటా ఎప్పుడైనా ప్రజలకు సేవా చేశావా?

బర్త్‌డే రోజే అయ్యన్నకు సోదరుడు ఝలక్‌!

అయినా టీడీపీకి బుద్ది రాలేదు: ఎమ్మెల్యే ఎలిజా

'5శాతం' అంటే ఏమిటో మీకు తెలుసా?

‘అవినీతి ప్రభుత్వాన్ని ఎండగడతాం’

జైపాల్‌రెడ్డి మచ్చలేని నాయకుడు : మన్మోహన్‌

కుటుంబ సమేతంగా సోనియాను కలిసిన రేవంత్‌

‘కేసీఆర్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు’

‘ఏపీ నేతలు చాలా మంది టచ్‌లో ఉన్నారు’

‘కేసీఆర్‌, కేటీఆర్‌ అసమర్థులని ఆ ర్యాంకులే చెప్తున్నాయి’

వినాయకుడు మైలపడతాడని దూషించారు : ఎమ్మెల్యే శ్రీదేవి

బీజేపీ సర్కారు ఒప్పుకొని తీరాలి

కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు భ్రమే!

‘ఈడ్చి కొడితే ఎక్కడో పడ్డ చంద్రబాబు..’

పయ్యావుల వర్గీయుల రౌడీయిజం..

మోదీకి మిలిందా గేట్స్ ఫౌండేషన్ అవార్డు

టీడీపీ నేతల వ్యాఖ్యలు.. దళిత ఎమ్మెల్యే కంటతడి

చిదంబరానికి స్వల్ప ఊరట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైదరాబాద్‌కు మారిన ‘కేజీఎఫ్‌-2’

యాక్షన్‌... కట్‌

దసరా రేస్‌

లుక్కు... కిక్కు...

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే