బాబు ఆడే డ్రామాలో నిమ్మ‌గ‌డ్డ ఓ పాత్ర‌ధారి

23 Jun, 2020 18:50 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావ‌రి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌ కుమార్ నిజ‌స్వ‌రూపం కోసం తాము చెబితే ఎవ‌రూ న‌మ్మ‌లేద‌ని వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు. కానీ ఇప్పుడు ఆయ‌న అస‌లు స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న‌ కాకినాడ‌లో మీడియాతో మాట్లాడుతూ.. "హం తుమ్‌ ఏక్ కమరేమే" అన్నట్లుగా అందరు ఒకే గదిలో కూర్చుని నిమ్మగడ్డ ఎవరితో మంతనాలు చేస్తున్నారని ప్ర‌శ్నించారు. ఎవరి మీద కుట్ర చేసేందుకు ప్రైవేటు హోటల్స్‌లో కలిశారని నిల‌దీశారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఖ్యాతి, పరపతిని కుదించాలని ప్రయత్నం చేస్తున్నారని, ఆ కుట్రలో భాగంగానే కలిశార‌న్న విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ని తెలిపారు. (వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?)

"బీజేపీ నేత‌లు కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరితో కలిసి ఉండడంతో నిమ్మగడ్డ నిజ స్వరూపం బయట పడింది. నిమ్మగడ్డ రమేష్ ఇప్పటికీ సచ్చీలుడని చెబుతారా? నిమ్మగడ్డ కోసం చెబితే కోర్డుల నుంచి మాకు నోటీసులు ఇస్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన కుట్రే. బాబు కుట్ర ఎజెండా ప్రజలకు తెలిసింది. చంద్రబాబు అండ్ కో ఆడుతున్న డ్రామాలో నిమ్మగడ్డ ఒక పాత్రధారి అని బయట పడింది" అని మంత్రి పేర్కొన్నారు. (నిమ్మగడ్డతో రహస్య భేటీపై బీజేపీ అసంతృప్తి)

మరిన్ని వార్తలు