‘ఆనాడు భూముల విక్రయ కమిటీలో బీజేపీ వారు లేరా’

26 May, 2020 18:00 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎక్కడ అన్యాయం జరిగిందని బీజేపీ నేతలు దీక్షలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం పార్టీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆనాడు భూముల విక్రయ కమిటీలో బీజేపీ వారు లేరా అని ప్రశ్నించారు. అప్పటి మంత్రి మాణిక్యాలరావు బీజేపీకి చెందిన వారు కదా అని ధ్వజమెత్తారు. ఆ రోజు భూముల విక్రయాలపై ప్రశ్నించాలనుకుంటే మీకు మీరే ప్రశ్నించుకోవాలని విమర్శించారు. టీటీడీ భూములను అప్పనంగా కొట్టేయాలని చూసింది చంద్రబాబు కాదా అని, సదావర్తి భూముల విషయాన్ని రాష్ట్రమంతా చూసిందని పేర్కొన్నారు. (రైతుల్ని మోసం చేసింది మీరు కాదా?)

ఏదో జరిగిపోయినట్లు చంద్రబాబు గగ్గోలు పెట్టడం.. దానికి కన్నా లక్ష్మీనారాయణ తందానా అనడం రివాజుగా మారిందని కురసాల ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్రంలో ఒక్క తమ పార్టీ మినహా అన్ని పార్టీలను చంద్రబాబే నడుపుతున్నట్లున్నారని వ్యాఖ్యానించారు. తాము హిందువుల మనోభావాలను కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడతామన్నారు. మతాల మధ్య లేనిపోని అపోహలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చుస్తున్న జనసేన నేత పవన్‌ కల్యాన్‌ ఇక్కడ ఎం జరుగుతుందో వాస్తవాలు ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. ('ఏడాది కాలంలోనే మేమేంటో నిరూపించాం')

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా