రైతులు ఆందోళన చెందోద్దు: కురసాల

28 Apr, 2020 17:37 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఆందోళన చెందొద్దని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. జిల్లాలోని రూరల్‌ వ్యవసాయ అనుబంధ సంస్థలను మంత్రితో పాటు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎంపీ వంగా గీతా తదితరులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ..వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు.. ఆ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఆటంకం కలిగించ వద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. అవసరమైతే  ఇతర జిల్లాలకు చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులకు కూడా అనుమతించమని సీఎం జగన్‌ ఆదేశించినట్లు చెప్పారు. ఆక్వా, ఫౌల్ట్రీ రంగాలకు ఎటువంటి మద్దతు ఇచ్చామో...ఉద్యానవన ఉత్పత్తులు...దాని అనుబంధ పరిశ్రమలకు కూడా అదే విధంగా మద్దతు ఇస్తామన్నారు. (తప్పుడు సమాచారమిస్తే కేసులు తప్పవు)

మామిడి ధరలు పడిపోకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. మే15 నుంచి రెండవ సంవత్సరం రైతు భరోసా పథకం అమలు చేయడానికి ప్రణాళిక సిద్దం చేశామని, దీనికి సంబంధించి సోషల్ ఆడిట్‌ను కూడా ఆదేశించామని చెప్పారు. ప్రతి గ్రామా సచివాలయంలో అర్హులైన లబ్థిదారుల పేర్లు ప్రచురిస్తున్నామని, కరోనా వంటిఇబ్బందికర పరిస్ధితులలో కూడా రైతులకు మేలు చేయడం కోసం సిఎం జగన్ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయడం లేదని పేర్కొన్నారు. అంతేగాక అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని  సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హోం క్వారంటైన్‌లో ఉండి గడప దాటి బయటకు రాకుండా ఇంట్లో కుర్చుని ట్వీట్‌లు చేస్తున్నారని విమర్శించారు. గీతా కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని భ్రమ కల్పించేందుకు బాబు ట్వీట్ చేశారని ఆయన మండిపడ్డారు. మూడు సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు కొంచమైన జ్ఞానాన్ని ప్రదర్శించాలా లేదా అని ఆయన మండిపడ్డారు. (కరోనా టెస్టులు: దేశంలోనే ప్రథమ స్థానం..)

కాకినాడ రూరల్‌లో గత 30 ఏళ్ళుగా ఏపీఐసీసీలో ఉన్న రైతుల సమ్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని, దాదాపు103 ఎకరాలు రైతుల నుంచి సేకరించిన భూములను తిరిగి ఇప్పిస్తే.. దాన్ని ఇళ్ల స్థలాల కోసం సేకరించామని చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. అలా సేకరించిన భూములను ఇళ్ళ స్ధలాలకు కేటాయించేందుకు ఆ భూముల్లోని తాడిచెట్లను అధికారులు తొలగించినందుకు చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న గీతా కార్మికుల ఉపాధిని సీఎం జగన్ దెబ్బతీసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో 33 వేల ఎకరాల సారవంతమైన భూమలను సేకరించి.. పండ్ల తోటలు, కొబ్బరి, తాడి చెట్లను, వేలాది వృక్షాలను చంద్రబాబు నాశనం చేశారని, అమరావతి పేరుతో దుఖానం పెట్టినప్పుడు ఈ చెట్లు ఏం చేద్దామనుకున్నారని ప్రశ్నించారు. తాడిచెట్లు తీయకుండానే అమరావతిలో భవనాలు నిర్మించారా చెప్పండి ? ఐదు వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని కొన్ని తాడిచెట్లు తొలగిస్తే చంద్రబాబుకు ఏం నొప్పికలుగుతుందని మండిపడ్డారు తాడిచెట్ల తొలగింపుపై చంద్రబాబు చెప్పేది అభూతకల్పన అని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు