ఇంగ్లీష్‌ మీడియం సరైన నిర్ణయం: హఫీజ్‌ ఖాన్‌

12 Dec, 2019 18:54 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆధునిక సమాజంలో ఆంగ్ల విద్య ఎంతో అవసరమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ అన్నారు. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూ ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం శుభపరిణామం అని ఆయన పేర్కొన్నారు.  పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ-2019 బిల్లుపై గురువారం సభలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ప్రజలకు ఏది కావాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదే చేస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీద పట్టు ఉంటే కాన్ఫిడెంట్‌ లెవల్‌ పెరుగుతుంది. వాళ్లు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా రాణించగలుగుతారు. 

ఇంగ్లీష్‌ మీడియంపై మాట్లాడేందుకు చంద్రబాబుకు పాయింటే లేదు. ఆయన అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం సరైన నిర్ణయం. తెలుగు, ఉర్ధూకు సముచిత స్థానం ఇస్తూ ఇంగ్లీష్‌ మీడియంను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దాన్ని ప్రతిపక్ష సభ్యులు వక్రీకరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సీఎం జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. 

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ కదా...నేర్చుకుందామంటే..
చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది కాబట్టి, ఆయన సభలో ఏం మాట్లాడతారో అని ఎంతో ఎదురు చూశాం. చంద్రబాబు మాట్లాడుతూంటే ఏదైనా మాలాంటి కొత్త ఎమ్మెల్యేలు నేర్చుకోవాలనుకుంటాం. ఆయన కన్నా మేమే బెటర్‌ అనుకుంటున్నాను. కానీ జిలేబీ మాదిరి అక్కడక్కడే చుట్టి ఏమీ చెప్పరు.  పాయింట్‌ మీద మాట్లాడరు. సూటిగా రెండు నిమిషాలు మాట్లాడ ముగిస్తారమే అనుకుంటే చాలా సమయాన్ని తీసుకుంటున్నారు. పాయింట్‌ మాత్రం చెప్పరు. మేము కూడా సభలో మాట్లాడాలి కదా. అయితే చంద్రబాబు మాట్లాడేందుకు పాయింటే లేదు. ప్రతి బాల్‌కు జగన్‌ సిక్సర్‌ కొడుతూంటే బాబుకు దిక్కుతెలియడం లేదు. గల్ఫ్‌ దేశాల్లో ఇంగ్లీష్‌ రాకపోవడం వల్ల చాలా అవమానాలు ఎదురవుతున్నాయి. అదే ఆంగ్ల మాధ్యమంలో చదివితే వాళ్లిచ్చే మర్యాదే వేరు.

సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయిన స్కూళ్లలో వాటర్‌ బెల్‌ కాన్సెప్ట్‌ చూసి నా నియోజకవర్గంలో అమలు చేశాం. మంచి స్పందన వచ్చింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకు వెళితే రాష్ట్రవ్యాప్తంగా అమలు అవుతుందా అనేది నాకు కొద్దిగా అనుమానం కలిగింది. అయితే సీఎం జగన్‌తో పాటు విద్యాశాఖ మంత్రికి దృష్టికి తీసుకువెళ్లడం... వెంటనే అన్ని పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ను అమలు చేస్తూ జీవో జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే మంచి అనేది ఎక్కడ నుంచి అయినా తీసుకుని అమలు చేస్తారనేదానికి ఇది ఉదాహరణ. ఇలాంటివన్నీ చూస్తుంటే టార్చ్‌ బేరర్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా పని చేయడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

మరిన్ని వార్తలు