మూసీని కలుషితం చేశారు: లక్ష్మణ్‌

17 Dec, 2019 03:48 IST|Sakshi

లంగర్‌హౌస్‌: సమైక్య రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు మూసీని కలుషితం చేశారని దూషించి, ఇప్పుడు రాష్ట్రం సాధించాక వారి వద్ద నుంచి ముడుపుల ప్రవాహాన్ని తెచ్చుకుంటూ ప్రజల ప్రాణాలతో సీఎం కేసీఆర్‌ చెలగాటాలాడుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. ‘నమామి మూసీ’ ఉద్యమంలో భాగంగా లంగర్‌హౌస్‌ త్రివేణి సంగమాన్ని ఆయన సోమవారం తిలకించారు. వికారాబాద్‌ అనంతగిరి కొండల నుంచి తెచ్చి న ముచికుందా జలాన్ని త్రివేణి సంగమంలో వదిలి పూజలు చేశారు. ‘మూసీని, ప్రజల ఆరోగ్యాలను కాపాడుకుందాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు.

కోరితే 70 శాతం నిధులు ఇస్తాం.... 
ఈ సందర్భంగా ఆలయం ముందు రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. సబర్మతితో పాటు, గంగా నదిని పూర్తిగా శుద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కోరితే మూసీ ప్రక్షాళన, హుస్సేన్‌ సాగర్‌ శుద్ధి కోసం 70 శాతం నిధులను కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, చింతల రాంచంద్రారెడ్డి, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు