‘బీసీల అభ్యున్నతికి బాబు మోకాలు అడ్డుపెట్టారు’

5 Mar, 2020 18:04 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబుకు స్వలాభం తప్ప మరో ఆలోచన లేదని, బీసీల రిజర్వేషన్లను బాబు అడ్డుకున్నారని, ప్రతాప్‌రెడ్డితో చంద్రబాబే కోర్టులో పిటిషన్‌ వేయించారని తెలిపారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, మహిళలను అడ్డం పెట్టుకుని రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బినామీ భూముల కోసం అమాయకులను బలి పశువులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, బాబుకు రాజకీయ విలువలు లేవని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. (స్థానిక ఎన్నికల్లో పోటీ చేయం)

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను అడ్డుకున్నది చంద్రబాబేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. ప్రతాప్‌రెడ్డి బాబు అనుచరుడు కాదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలతో ప్రతాప్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, బీసీల అభ్యున్నతికి చంద్రబాబు మోకాలు అడ్డుపెట్టారని విమర్శించారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగాలు కల్పించామని, బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్‌ అండగా నిలిచారని ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు