వేర్వేరుగానే వామపక్షాల పోటీ!

21 Mar, 2019 03:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్టుపార్టీలైన సీపీఐ, సీపీఎంల పొత్తు ప్రయత్నాలు విఫలమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం చెరి 2 స్థానాల్లో వేర్వేరుగానే పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈమేరకు గురువారం 2 పార్టీలు తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇరుపార్టీ లు పోటీచేయని స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతునిచ్చే అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఎవరి దారి వారు చూసుకోవాలనే 2 పార్టీలు నిర్ణయించాయి.

ఇరు పార్టీలు పోటీచేసే స్థానాల్లోనైనా సహకారం ఏమేరకు ఉంటుందన్న దానిపైనా స్పష్టత లేదు. మఖ్దూంభవన్‌లో బుధవారం జరిగిన సీపీఐ,సీపీఎం ఐదో దఫా చర్చల్లోనూ వీటి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పొత్తులు, రాజకీయవిధా నంపై తమ కార్యదర్శి వర్గభేటీలో చర్చించాక, జాతీయ నాయకత్వం సలహాలు తీసుకుని సీపీఎం రాష్ట్ర పార్టీకి ఫోన్లో నిర్ణయాన్ని తెలియజేస్తామని సీపీఐ చెప్పినట్టు సమాచారం. రాత్రివరకు సీపీఎం నాయకులకు సమాచారం అందకపోవడంతో తాము నిర్ణయించుకున్న పంథాలోనే ముందుకెళ్లాలని సీపీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు