58మందితో మోదీ మంత్రివర్గం

30 May, 2019 20:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప‍్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రీమ్‌ టీమ్‌ ప్రమాణ స్వీకారం చేసింది. భారత ప్రధానమంత్రిగా మోదీ రెండోసారి అంతఃకరణ శుద్ధితో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. మోదీ భారతదేశానికి 16వ ప్రధాని. మోదీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేంద్ర మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా కేబినెట్‌ కూర్పుపై ప్రధాని మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సుదీర్ఘంగా చర్చలు జరిపినా చివరి వరకూ గోప్యత పాటించారు. 58మందితో నరేంద్ర మోదీ మంత్రివర్గం కొలువుతీరింది. మోదీతో సహా 25మంది కేంద్ర మంత్రులు, స్వతంత్ర హోదాలో 9మంది సహాయ మంత్రులు, 24 సహాయ మంత్రులుగా  ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శాఖల కేటాయింపు ఇంకా జరగలేదు. కాగా గత మంత్రివర‍్గంలో 25మంది కేంద్రమంత్రులుగా, 11 సహాయ (స్వతంత్ర), 40 సహాయ మంత్రులుగా ఉన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
మోదీతో సహా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం

కేంద్రమంత్రులు...
1. నరేంద్ర మోదీ (ప్రధానమంత్రి)
2. రాజ్‌నాథ్‌ సింగ్‌
3. అమిత్‌ షా
4. నితిన్‌ గడ్కరీ
5. సదానంద గౌడ
6. నిర్మలా సీతారామన్‌
7. రాంవిలాస్‌ పాశ్వాన్‌
8. నరేంద్ర సింగ్‌ తోమర్‌
9. రవిశంకర్‌ ప్రసాద్‌
10. హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌
11. థావర్‌ చంద్‌ గెహ్లాట్‌
12. సుబ్రహ్మణ్యం జయశంకర్‌
13. రమేశ్‌ పోఖ్రియాల్‌
14. అర్జున్‌ ముండా
15. స్మృతి ఇరానీ
16. డాక్టర్‌ హర్షవర్థన్
17. ప్రకాశ్‌ జవదేకర్‌
18. పీయూష్‌ గోయల్‌
19. ధర్మేంద్ర ప్రధాన్‌
20. ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ
21. ప్రహ్లాద్‌ జోషీ
22. మహేంద్రనాథ్‌ పాండే
23. అరవింద్‌ సావంత్‌
24. గిరిరాజ్‌ సింగ్‌
25. గజేంద్ర సింగ్‌ షెకావత్‌

సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)
1. సంతోష్‌ గాంగ్వర్‌
2. రావ్‌ ఇందర్జీత్‌ సింగ్‌
3. శ్రీపాద యశో నాయక్‌
4. జితేంద్ర సింగ్‌ (సహాయ మంత్రి)
5. కిరణ్‌ రిజిజు  (సహాయ మంత్రి)
6. ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ (సహాయ మంత్రి)
7. రాజ్‌ కుమార్‌ సింగ్‌ (సహాయ మంత్రి)
8. హర్దీప్‌ సింగ్‌ పూరీ (సహాయ మంత్రి)
9. మన్సూఖ్‌ మాండవియా (స్వతంత్ర సహాయ మంత్రి)

సహాయ మంత్రులు
1. ఫగ్గీన్‌ సింగ్‌ కులస్తే
2.. అశ్వినీ చౌబే
3. అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌
4. జనరల్‌ వీకే సింగ్‌
5. కిృషన్‌ పాల్‌ గుజ్జర్‌
6. దాదారావ్‌ పాటిల్‌
7. కిషన్‌ రెడ్డి
8. పురుషోత్తం రూపాలా
9. రాందాస్‌ అథవాలే
10. సాధ్వీ నిరంజన్‌ జ్యోతి
11. బాబుల్‌ సుప్రియో
12. సంజీవ్‌ కుమార్‌ బాల్యాన్‌
13. దోత్రే సంజయ్‌ శ్యారావ్‌
14. అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌
15. సురేష్‌ అంగాడి
16. నిత్యానంద్‌ రాయ్‌
17. రత్తన్‌ లాల్‌ కఠారియా
18. వి.మురళీధరన్‌
19. రేణుకా సింగ్‌ 
20. సోమ్‌ ప్రకాశ్‌
21. రామేశ్వర్‌ తెలి
22. ప్రతాప్‌ చంద్ర సారంగి
23. కైలాస్‌ చౌదరి
24. దేవశ్రీ చౌదురి

మరిన్ని వార్తలు