లైవ్‌ అప్‌డేట్స్‌: పోలీసు ఉన్నతాధికారుల బదిలీ

17 May, 2018 08:35 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్ప నేడు (గురువారం) ప్రమాణం చేశారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ఉదయం 9 గంటలకు ఆయనతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో లైన్‌క్లియర్‌ అయిన సంగతి తెలిసిందే. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.. కర్ణాటక రాజకీయ పరిణామాలకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవి..

పోలీసు ఉన్నతాధికారుల బదిలీ

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే బీఎస్‌ యడ్యూరప్ప పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీగా అమర్‌కుమార్‌ పాండేను నియమించారు. ఇంటెలిజెన్స్‌ డిప్యూటీ ఐజీగా సందీప్‌ పాటిల్‌ను నియమించారు.

గోవాకు కర్ణాటక సెగ

  • కర్ణాటక రాజకీయ సంక్షోభం సెగ గోవాను తాకింది. గోవా రాజ్‌భవన్‌ ముందు తమ ఎమ్మెల్యేలతో రేపు పరేడ్‌ నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

సుప్రీంకోర్టులో కాంగ్రెస్-జేడీఎస్ పిటిషన్

  • న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్‌ను ఎమ్మెల్యేగా నామినేట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్-జేడీఎస్ పిటిషన్ దాఖలు చేసింది. బలపరీక్ష పూర్తయ్యేంత వరకు నియామకం చేయకుండా చూడాలని కోరింది.


టచ్‌లో స్వతంత్ర ఎమ్మెల్యేలు.. పని అయిపోతోంది!

  • అసెంబ్లీ వేదికగా జరిగే బలనిరూపణలో బీజేపీ నెగ్గి తీరుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బీ శ్రీరాములు బలపరీక్షపై స్పందించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, పని అయిపోతుందని ఆయన అన్నారు.

ప్రాంతీయ పార్టీల మద్దతు కోరిన కుమారస్వామి

  • మమతా బెనర్జీ, కేసీఆర్‌, చంద్రబాబు, నవీన్‌ పట్నాయక్‌లు కేంద్రానికి వ్యతిరేకంగా రావాలంటూ పిలుపు
  •  బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలి

రేపు లేదా ఎల్లుండే బలపరీక్ష..: యడ్యూరప్ప

  • అసెంబ్లీలో బలం నిరూపించుకుంటా.. రేపు లేదా ఎల్లుండి బలపరీక్ష ఉండొచ్చు
  • కన్నడ ప‍్రజల ఆశీస్సులతోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశా
  • నాకు మద‍్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
  • కాంగ్రెస్‌, జేడీఎస్‌లు అనైతికంగా అధికారంలోకి రావాలనుకున్నాయి: యడ్యూరప్ప
  • కర్ణాటకలో రూ.56వేల కోట్ల రైతు రుణాలు రద్దు
  •  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యడ్యూరప్ప రుణాల రద్దు ఫైలుపై తొలి సంతకం

మళ్లీ రిసార్ట్‌కి చేరిన రాజకీయాలు

  • విధాన సౌధలో ముగిసిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ ధర్నా
  • ధర్నాలో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
  • తిరిగి రిసార్ట్‌కు చేరుకున్న కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు

సుప్రీంకోర్టుకు రాంజెఠ్మలానీ

  • బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ.. యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో.. సీనియర్‌ న్యాయవాది రాం జెఠ్మలానీ ఇంప్లీడ్‌కు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
  • అయితే సరైన బెంచ్ ముందు ప్రస్తావించాలని ధర్మాసనం సూచించింది. యడ్యూరప్ప ప్రమాణానికి సుప్రీంకోర్టు ఇప్పటికే లైన్‌ క్లియర్‌ చేసింది. వ్యక్తిగత హోదాలో గవర్నర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

యెడ్డీ ప్రమాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన

  • ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నేతలు కర్ణాటక విధానసౌధ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌తోపాటు మాజీ సీఎం సిద్దరామయ్య ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.

యెడ్డీకి వ్యతిరేకంగా ప్రజాకోర్టుకు వెళుతాం: సిద్దూ

  • ప్రస్తుతం యడ్యూరప్ప ప్రమాణ స్వీకార అంశం సుప్రీంకోర్టు ఎదుట పెండింగ్‌లో ఉంది. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. మేం ప్రజల్లోకి వెళ్లి ఈ విషయాన్ని చాటుతాం: మాజీ సీఎం సిద్దరామయ్య
  • రాజ్‌భవన్‌లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్‌ యడ్యూరప్ప ప్రమాణం
  • రాజ్‌భవన్‌కు చేరుకున్న యడ్యూరప్ప.. మరికాసేపట్లో 23వ సీఎంగా ప్రమాణస్వీకారం
  • ‘వందేమాతరం, మోదీ.. మోదీ’  అంటూ రాజ్‌భవన్‌ ఎదుట బీజేపీ కార్యకర్తలు నినాదాలు..
  • రాజ్‌భవన్‌ బయలుదేరిన యడ్యూరప్ప.. మరికాసేపట్లో సీఎంగా ప్రమాణం
  • రాజ్‌భవన్‌లో అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేశారు.
  • యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రకాశ్‌ జవదేకర్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరు అయ్యారు.

మరిన్ని వార్తలు