నేడే ‘స్థానిక’ మండలి ఎన్నికలు

31 May, 2019 03:18 IST|Sakshi

వరంగల్, రంగారెడ్డి,  నల్లగొండ స్థానాలకు పోలింగ్‌

 జూన్‌ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు  

సాక్షి, హైదరాబాద్‌ : వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాలకు శుక్రవారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 2,799 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రంగారెడ్డిలో 8, వరంగల్‌లో 10, నల్లగొండలో 7 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశా రు. రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, (టీఆర్‌ ఎస్‌), కోమరి ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్‌), నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి (టీఆర్‌ఎస్‌), కోమటిరెడ్డి లక్ష్మి (కాంగ్రెస్‌), వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), ఎంగాల వెంకట్రామ్‌రెడ్డి (కాంగ్రెస్‌), ఇండిపెండెంట్లుగా ఎ.యాకయ్య, తక్కళ్లపల్లి రవీందర్, రంగరాజు రవీందర్‌ పోటీలో ఉన్నారు. జూన్‌ 3న ఫలితాలను ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు