కరోనా: సీఎం బుద్ధి మారాలని యాగం!

26 Apr, 2020 20:22 IST|Sakshi

పట్నా: బిహార్‌ మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, లాలూ ప్రసాద్‌ యాద్‌ కొడుకు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి ఆదివారం ఓ యాగం తలపెట్టారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బుద్ధి మారాలంటూ ఆయన సద్బుద్ధి మహాయజ్ఞం నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న బిహార్‌ ప్రజలు, విద్యార్థులను తిరిగి స్వస్థలాలకు తీసుకొచ్చే విధంగా సీఎం నితీశ్ కుమార్ మనసు మారాలనే ఈ యజ్ఞం నిర్వహించిన‌ట్లు తేజ్‌ప్ర‌తాప్‌ వెల్లడించారు. ముఖానికి మాస్క్ ధ‌రించి సామాజిక దూరం పాటించినప్పటికీ యజ్ఞయాగాదులపై నిషేధం ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 251 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. ఇద్దరు మరణించారు. 46 మంది కోలుకున్నారు.
(చదవండి: వివక్ష వద్దు.. 130 కోట్ల జనం మనోళ్లే!

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు