లోక్‌సభలో కొనసాగిన దుమారం

20 Dec, 2017 01:41 IST|Sakshi
రాజ్యసభలో మాట్లాడుతున్న ఆనంద్‌ శర్మ

కాంగ్రెస్‌ తీరు సిగ్గుచేటు: బీజేపీ

రాజ్యసభ ప్రతిష్టంభనపై కమిటీ

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం కొనసాగగా దీనిపై కమిటీ ఏర్పాటుకు రాజ్యసభలో సభ్యులు అంగీకారం తెలిపారు. మన్మోహన్‌ పాకిస్తాన్‌ నేతలతో కలిసి కుట్ర పన్నారంటూ ప్రధాని చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్‌ మోదీ క్షమాపణ చెప్పాలంటూ మూడు రోజులుగా సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతోంది. మంగళవారం లోక్‌సభ జీరోఅవర్‌లో ఈ విషయాన్ని లేవనెత్తేందుకు ఆనంద్‌శర్మతోపాటు ఇతర కాంగ్రెస్‌ సభ్యులు ప్రయత్నించగా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అంగీకరించలేదు.

తర్వాత కాంగ్రెస్‌ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ఏదో అంశాన్ని లేవనెత్తటానికి యత్నించగా స్పీకర్‌ అనుమతించలేదు. దీంతో ఆ పార్టీ సభ్యులు వాకౌట్‌ చేశారు. కాంగ్రెస్‌ తీరు సిగ్గుచేటని బీజేపీ మండిపడింది. మన్మోహన్‌పై మోదీ వ్యాఖ్యలతో రాజ్యసభలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు అన్ని పార్టీల నేతలతో ప్రైవేటుగా సమావేశమయ్యారు. విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాల న్నారు. ఇందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయా లని సూచించగా సభ్యులు అంగీకరించారు.

మరిన్ని వార్తలు