తుడిచిపెట్టుకుపోయిన మలిదశ

7 Apr, 2018 02:29 IST|Sakshi

పార్లమెంటు నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ మలి దశ బడ్జెట్‌ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. సమావేశాల చివరి రోజూ లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి.  మొదటి రోజు నుంచి ఏపీకి ప్రత్యేక హోదా, బ్యాంకింగ్‌ కుంభకోణాలు, కావేరీ బోర్డు ఏర్పాటు, తెలంగాణలో రిజర్వేషన్‌ కోటా పెంపు తదితర అంశాలపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగించాయి.

రెండో దశలో ఉభయ సభలు 22 సార్లు సమావేశం కాగా ఒక్కరోజు కూడా కార్యకలాపాలు సాగలేదు. బడ్జెట్‌ సమావేశాల రెండు దశల్లోను లోక్‌సభ 29 సార్లు, రాజ్యసభ 30 సార్లు సమావేశం కాగా.. ఉభయ సభల్లోను కలిపి 250 గంటల పనిదినాలు వృథా అయ్యాయి. సభలో కొన్ని పార్టీల ఆందోళనల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నోటీసుల్ని కూడా లోక్‌సభ చర్చకు చేపట్టలేదు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకూ తొలి దశ సమావేశాలు సాగాయి.  

లోక్‌సభలో 127 గంటలు వృథా
లోక్‌సభ నిరవధిక వాయిదాకు ముందు స్పీకర్‌ మహాజన్‌ మాట్లాడుతూ.. ‘బడ్జెట్‌ సమావేశాల రెండు విడతల్లోను సభ 29 సార్లు సమావేశమైంది. మొత్తం 34 గంటల 5 నిమిషాలు పనిచేయగా.. అంతరాయాలు, వాయిదాల వల్ల మొత్తం 127 గంటల 45 నిమిషాలు వృథా అయ్యాయి. మొత్తం 580 ప్రశ్నల్ని సభ్యులు లోక్‌సభ ముందుంచగా.. కేవలం 17 ప్రశ్నలకు మంత్రులు మౌఖిక సమాధానమిచ్చారు’ అని చెప్పారు.

గ్రాట్యుటీ చెల్లింపుల(సవరణ) బిల్లు 2017, ప్రత్యేక పరిహారం(సవరణ) బిల్లు 2017లు లోక్‌సభ ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి. ‘ఈ రోజు చివరిరోజు.. సభ సజావుగా సాగేందుకు మీరు సిద్ధంగా లేకపోతే నిరవధికంగా వాయిదా వేస్తా. చర్చ జరిగేందుకు దయచేసి సహకరించండి’ అని స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు. అయితే అన్నాడీఎంకే సభ్యులు పోడియం వద్ద నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో సభను స్పీకర్‌ నిరవధికంగా వాయిదా వేశారు.  

రాజ్యసభలో 121 గంటల వృథా
రాజ్యసభలోను అదే పరిస్థితి కొనసాగింది. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సభను చైర్మన్‌ వెంకయ్య నిరవధికంగా వాయిదా వేశారు. బడ్జెట్‌ సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 30 సార్లు సమావేశం కాగా 44 గంటలపాటు సభా కార్యకలాపాలు కొనసాగాయని, 121 గంటల సమయం వృథా అయ్యిందని వెంకయ్య నాయుడు వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు వృథా కావడానికి కాంగ్రెస్‌ కారణమని ఆరోపిస్తూ.. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కేంద్ర మంత్రులు ఆందోళన నిర్వహించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సభను అడ్డుకుంటే ఊరుకోం: అంబటి

‘అందుకే కలెక్టర్లకు విశేషాధికారాలు’

ఎన్ఎండీసీ నుంచే విశాఖ స్టీల్‌కు ముడి ఖనిజం

అక్బరుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

మహనీయులు కోరిన సమసమాజం జగన్‌తోనే సాధ్యం

కర్ణాటకం: పతనం వెనుక కాంగ్రెస్‌!

వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు

కేసీఆర్‌ గారూ! మీరు తెలంగాణాకు ముఖ్యమంత్రి..

భ్రమరావతిలోనూ స్థానికులకు ఉపాధి కల్పించలేదు

స్థానికులకు 75శాతం జాబ్స్.. ఇది చరిత్రాత్మక బిల్లు

పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌

ట్రంప్‌తో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు!

ఆంధ్రప్రదేశ్‌కు మందకృష్ణ బద్ధ శత్రువు

సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు

సభను నవ్వుల్లో ముంచెత్తిన మంత్రి జయరాం

‘మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు’

‘తాళపత్రాలు విడుదల చేసినా.. మిమ్మల్ని నమ్మరు’

‘ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొననివారు అనర్హులే’

‘ఎందుకు బహిష్కరించారో అర్థం కావట్లేదు’

అక్టోబర్‌ నుంచే రైతులకు పెట్టుబడి సాయం

కాల్‌మనీ కేసుల్లో రూ.700 కోట్ల వ్యాపారం

ప్రతిరోజూ రాద్ధాంతమేనా!!

బోయపాటికి షూటింగ్‌ చేయమని చెప్పింది ఎవరు?

‘ప్రతిదీ కొనలేం.. ఆ రోజు వస్తుంది’

అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ సభ్యులు అత్యుత్సాహం

కూలిన కుమార సర్కార్‌ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు

మరో పది రోజులు పార్లమెంట్‌!

అసెంబ్లీలో టీడీపీ తీరు దారుణం 

అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నారు

బడుగులకు మేలు చేస్తే సహించరా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!

సెల్యూట్‌ ఆఫీసర్‌

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి