హనుమాన్‌ జాట్‌ కులస్తుడే: యూపీ మంత్రి

22 Dec, 2018 04:44 IST|Sakshi
ఉత్తరప్రదేశ్‌ మత వ్యవహారాల శాఖ మంత్రి లక్ష్మీ నారాయణ్‌ చౌధరి

లక్నో: ఆంజనేయుడు తమ జాట్‌ కులస్తుడేనని ఉత్తరప్రదేశ్‌ మత వ్యవహారాల శాఖ మంత్రి లక్ష్మీ నారాయణ్‌ చౌధరి వ్యాఖ్యానించారు. ‘శ్రీరాముడి అర్ధాంగి సీతమ్మను రావణుడు ఎత్తుకెళ్లాడు. హనుమంతుడు వెళ్లి లంకాదహనం చేశాడు. శ్రీరాముడికి అపకారం తలపెట్టింది రావణుడు. అసలు సీతారాములు ఎవరో, రావణుడు ఎవరో హనుమంతుడికి తెలియదు. కానీ, ఆయన అన్యాయం జరుగుతుంటే సహించలేకపోయాడు. ఇదే జాట్ల వ్యక్తిత్వం. అన్యాయం ఎక్కడ, ఎవరికి జరిగినా జాట్లు సహించలేరు’ అంటూ తన వాదనను సమర్థించుకున్నారు.  

మరిన్ని వార్తలు